Shri Veerabhadra Dandakam | శ్రీ వీరభద్ర దండకం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Shri Veerabhadra Dandakam శ్రీ వీరభద్ర దండకం

శ్రీ వీరభద్ర దండకం

శ్రీమన్ మహావీరభద్రా సుమౌనీంద్ర భద్రపణ సర్వసిద్ధిప్రదా భద్రకాళీమనఃపద్మసంచార భాగ్యోదయా నిత్యసత్యప్రియా సచ్చిదానందరూపా విరూపాక్ష దక్షధ్వరధ్వంసకా దేవ నీ దైవతత్త్వంబులన్ బొగడ బ్రహ్మాదులే చాలరన్నన్ మనో బుద్ధి చాంచల్యమున్ జేసి వర్ణింపగా బూనితిన్ రుద్రుడిన్నింద్రదంష్ట్రోష్టుడై క్రోధతామ్రాక్షుడై అంగ దుర్దంగ పింగ జటాజూట సందోహమందొక్క దివ్యజ్జటన్ తీసి శ్యామండలిన్ వైవ భూమ్యాన్తరిక్షంబులన్ ప్రజ్వల్లతాపాక జ్వాలలన్ జిమ్ము కేశాలితో చండ వేదాండ శుండావ డొర్దండ హేతి ప్రకాండంబుతో విస్ఫులింగద్యుతిన్ వెల్గు నేత్రత్రయీయుక్త నాభిలక్-దంష్ట్రోగ్ర వక్త్రంబుతో వీరభద్రుండవై బుట్టి దక్షధ్వరధ్వంసమున్ జేయు నీ తండ్రి యాజ్ఞన్ తలందాల్చి భూత ప్రపంచంబు వెన్నంటరానట్టె బ్రహ్మాండభాండమ్ములుర్రూతలూగన్ దిగంతంబులట్టిట్టులై మ్రొక్క బ్రహ్మాదులెంతో భయభ్రాంతులై పార నాయజ్ఞశాలాటవిన్ జొచ్చి పంచాస్యముల్ నాపశుప్రాతమున్ బట్టి పెల్లార్చుచున్ జీల్చి చండాడి మార్తాండునిన్ బట్టి పండ్లూడగా గొట్టి భాషాసతీ నాసికన్ గోసి జంభారిదోస్తంభ శుంభప్రతాపంబు జక్కాడి శ్రీమహావిష్ణు చక్రంబు వక్రంబుగా మింగి అక్షీణ తౌక్షేయ విక్షేపమున్ జేసి దక్షులన్ ద్రుంచివేయున్ మహాభీతచేతస్కులై యప్రు రక్షించుమో వీరభద్రుండ మమ్ముంచు జేమోడ్చిసేవంచు దీనావళిన్ గాంచి సౌహార్దమొప్పన్ గటాక్షించి రక్షించితీవయ్య నిను దీక్షతో గోరి సేవించు భక్తవజ్రాళులన్ దీర్ఘాయురారోగ్య సౌభాగ్య సంపత్ మహాభోగ భాగ్యంబులన్ ప్రసాదించుమో వీరభద్రా మునిస్తోత్రపాత్ర నమస్తే నమస్తే నమస్తే నమః ||