Arunachala Aksharamanamala | అరుణాచల అక్షరమణమాల
Back to Stotras తిరిగి వెళ్ళండి

అరుణాచల అక్షరమణమాల Arunachala Aksharamanamala

అరుణాచల అక్షరమణమాల

సాక్షాదరుణగిరీశ్వర వరార్హమగు నక్షరమణమాల నమరించుటకును
కరుణాకరుండగు గణపతి యొసగి కరమ భయకరము కాపాడుగాక


అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ
అరుణాచల శివ అరుణాచలా


అరుణాచల మనుచు స్మరియించువారల అహము నిర్మూలింపు అరుణాచలా || ౧ ||

అళగు సుందరముల వలె చేరి నేను నీ వు౦దమభిన్నమై అరుణాచలా || ౨ ||

లోదూరి లాగి నీ లోగుహను చెరగా నమరించి తేమొకో అరుణాచలా || ౩ ||

ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిందించు అరుణాచలా || ౪ ||

ఈ నింద తప్పు నిన్నేటికి దలపించితిక విడువారెవరరు అరుణాచలా || ౫ ||

కనిన జనని కన్న ఘనదయాదాయకా ఇదియా యనుగ్రహము అరుణాచలా || ౬ ||

నిన్నేమార్చి యరుగనీక యుల్లము పైని నురుదిగా నుండుమా అరుణాచలా || ౭ ||

ఊరూరు తిరుగక యుల్లము నిను గని యణగ నీ ద్యుతి జూపుము అరుణాచలా || ౮ ||

నను చెరచి యిపుడు నను కలియక విడుటిది మగతన మొక్కొయా అరుణాచలా || ౯ ||

ఏటి కీ నిదుర నన్నితరులు లాగగ ఇది నీకు న్యాయమా అరుణాచలా || ౧౦ ||

పంచేంద్రియ ఖలులు మదిలోన దూరుచో మదిని నీవుందవో అరుణాచలా || ౧౧ ||

ఒకడవౌ నిను మాయ మొనరించి వచ్చువారెవరిది నీ జాలము అరుణాచలా || ౧౨ ||


ఓంకార వాక్యార్ధ యుత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచలా || ౧౩ ||

అవ్వబోలె నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారము అరుణాచలా || ౧౪ ||

కన్నుకు గన్నయి కన్నులేక కను నిను కనువారెవరుగనుము అరుణాచలా || ౧౫ ||

ఇనుము ఆయస్కాంతము వలె గవిసి నను విడువక కలసి నాతోనుండుము అరుణాచలా || ౧౬ ||

గిరి రూప మైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలుం అరుణాచలా || ౧౭ ||

క్రింద మీదెటను చెన్నొందు కిరణమణి నా క్రిందు గతి మాపు అరుణాచలా || ౧౮ ||

కుట్ర యంతయు గోసి గుణముగ బాలించు గురు రూపమై వెలుగు అరుణాచలా || ౧౯ ||

కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ చేరి కావుం అరుణాచలా || ౨౦ ||

వంచకా వేడియున్ గొంచెమున్ గరగవే అభయ మంచేలుమా అరుణాచలా || ౨౧ ||

అడుగకిచ్చెడు నీదు నకళంక మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచలా || ౨౨ ||

హస్తలమలక నీదు సద్రసమున సుఖోన్మాద మొందగ నేలు అరుణాచలా || ౨౩ ||

వల నుంచి భక్తుల పరిమార్చు ని ను గట్టుకొని యెట్లు జీవింతును అరుణాచలా || ౨౪ ||


కోపరహిత గుణ గురిగాగ నను గొను కొరయేమి చేసితి అరుణాచలా || ౨౫ ||

గౌతమ పూజిత కరుణా ఘన నగమా కడ గంట ఏలుమా అరుణాచలా || ౨౬ ||

సకలము కబళించు కరకాంతియిన మనో జలజ మరల్పుమా అరుణాచలా || ౨౭ ||

తిండిని నిన్జేరితిని తిన నా నేను శాంతమై పోవుదును అరుణాచలా || ౨౮ ||

మది చల్లపడ భద్రకర ముంచి యమృతనోర్ తెరు మనుగ్రహచంద్ర అరుణాచలా || ౨౯ ||

వన్నెను చెరచి నిర్వాణ మొనర్చి కృపావన్నె నిడి బ్రోవుమరుణాచలా || ౩౦ ||

సుఖ సముద్రము పొంగ వాక్ మనమ్ములడంగ నూరక నమరు మందరుణాచలా || ౩౧ ||

వంచింతువేల నన్ శోధింపకిక నీదు జ్యోతి రూపము చూపుం అరుణాచలా || ౩౨ ||

పరవిద్య గరపి యీ భూమి మైకము వీడి రూపగు విద్య జూపు అరుణాచలా || ౩౩ ||

చేరకున్నను మేను నీరుగ గరగి కన్నీటేరయి నశింతు అరుణాచలా || ౩౪ ||

ఛీ యని ద్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మారం అరుణాచలా || ౩౫ ||

చెప్పక చెపి నీవు మౌనత నుండని యూరక యుందువే అరుణాచలా || ౩౬ ||


సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్న వేరెది గతి అరుణాచలా || ౩౭ ||

శౌర్యము జూపితి శమియించె నని మాయ చలియి౦ప కున్నావు అరుణాచలా || ౩౮ ||

కుక్కకు న్నీచమే నేనే గురుతుగొని వెదకి నిన్జేరుదు అరుణాచలా || ౩౯ ||

జ్ఞానము లేక నీ యాస దైన్యము బాప జ్ఞానము దెల్పి బ్రోవుమరుణాచలా || ౪౦ ||

తేటి వలెను నీవు వికసింప లేదని యెదుట నిలుతువేల అరుణాచలా || ౪౧ ||

తత్వ మెరుగజాల నంతయై నిలుతువే యిదియేమి తత్వమో అరుణాచలా || ౪౨ ||

తా నేను తానను తత్వ మిద్దానిని తానుగా చూపింతు అరుణాచలా || ౪౩ ||

త్రిప్పి యహంతను నెప్పుడు లో ద్రుష్టి గన దెలియు ననునదే అరుణాచలా || ౪౪ ||

తీరముండని యెద వెదకియు నిన్ను నే తిరిగి పొందితి బ్రోవు మరుణాచలా || ౪౫ ||

సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పaga రావేల అరుణాచలా || ౪౬ ||

శుద్ధ వాంగ్మన యుతులం దోచు నీ నిజా హంత గల్పి నను బ్రోవు అరుణాచలా || ౪౭ ||

దైవ మనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణ నాశ మొనర్చితి అరుణాచలా || ౪౮ ||


వెదుకక గనిన సచ్చ్రీయనుగ్రహనిధి మది తెగుల్ తీర్చి బ్రోవు అరుణాచలా || ౪౯ ||

ధైర్యము పరుగిడు నీ నిజహమరయ నే నాశమైతి బ్రోవు అరుణాచలా || ౫౦ ||

తాకి కృపాకరము నను గలియకున్న నిజము నశింతు బ్రోవు అరుణాచలా || ౫౧ ||

దోషరహిత నీవు నాతో నైక్యమయి నిత్యానంద మయమోనర్పరుణాచలా || ౫౨ ||

నగకు నెడముకాదు నిన్వెదకిన నన్ను గను కృపానగ వేసి అరుణాచలా || ౫౩ ||

నాన లేదె వెదుక నేనయి నీ వొంటి స్థాణువై నిలిచితివి అరుణాచలా || ౫౪ ||

నీ జ్వాల గాల్చినన్ నీరు సేసెడు మున్నె నీ కృప వర్షింపు అరుణాచలా || ౫౫ ||

నీవు నే నణగ నిత్యానందమయముగా నిలుచు స్థితి కరుణి౦పు అరుణాచలా || ౫౬ ||

అణురూపు నిన్ను నే మిన్ను రూపుం చేర భావోర్ములెపుడాగు అరుణాచలా || ౫౭ ||

సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా జ్ఞానము కోసికావు అరుణాచలా || ౫౮ ||

మక్కి మక్కి కరగి నే నిన్ను శరణంద నగ్నుడవై నిల్చితి అరుణాచలా || ౫౯ ||

నేస్తముండని నాకు నీ యాశ చూపినన్ మోసగింపక బ్రోవు అరుణాచలా || ౬౦ ||


నవసి చెడు ఫలము నందేమి ఫల మేరి పక్వత లోగొను అరుణాచలా || ౬౧ ||

నొవ్వగింపకను నిన్ను నొసగి నన్ గోనలేదె యంతకుడవు నాకు అరుణాచలా || ౬౨ ||

చూచి చింతించి మేనుం దాకించి పక్వము చేసి నీ వేలి బ్రోవుం అరుణాచలా || ౬౩ ||

మాయ విషము పట్టి తలకెక్కి చెడుమున్నె కరుణ పటోసగిబ్రోవుం అరుణాచలా || ౬౪ ||

కను కృపన్ మాయాంతముగా కృప గనవేమి గను నీ కెవరు చెప్పుటెవరు అరుణాచలా || ౬౫ ||

పిచ్చి వీడ నినుబోలె పిచ్చి చేసితె దయన్ పిచ్చిని మాన్పుము అరుణాచలా || ౬౬ ||

నిర్భీతి నిను జేరు నిర్భీతు నను జేర భీతి నీకేలకో అరుణాచలా || ౬౭ ||

అల్ప జ్ఞాన మదేది సుజ్ఞాన మేదయా ఐక్య మంద కరుణింపు అరుణాచలా || ౬౮ ||

భూగంధమగు మది పూర్ణ గంధము గొన బూర్ణ గంధ మొసంగు అరుణాచలా || ౬౯ ||

పేరు తలపగనే పట్టి లాగితివి నీ మహిమ కనుదురెవరు అరుణాచలా || ౭౦ ||

పోగ భూతము పోని భూతమై పట్టినన్ భూతగ్రస్తుని చేసి తరుణాచలా || ౭౧ ||

మృదులతన్ నే బ్రాపు లేక వాడగనీక పట్టు కొమ్మయి కావు అరుణాచలా || ౭౨ ||


పొడిచే మయికపర్చి నా బోధ హరియించి నీ బోధ గనుపించితి అరుణాచలా || ౭౩ ||

పోకరాకలు లేని సమరంగ దివి జూపు మా కృపాపోరాటం అరుణాచలా || ౭౴ ||

భౌతిక మౌ మేని పట్టార్చి యెపుడు నీ మహిమ గన గరునిణింపు అరుణాచలా || ౭౫ ||

మలమందు నీవియ్య మలమగుటయో కృపా మలమందువై వెలుగు అరుణాచలా || ౭౬ ||

మానము గొని చేరువారి మానము బాపి నిరభిమానత వెలుగు అరుణాచలా || ౭౭ ||

మించగా వేడెడు కించిజ్ఞుడను నను వంచింపకను బ్రోవుమరుణాచలా || ౭౮ ||

నావికుడుండగ పెనుగాలి నలయు నావను గాక కాచి బ్రోవుం అరుణాచలా || ౭౯ ||

ముడిమూలముల్ గాన మునుకొంటివి సరిగ ముగియ భారము లేదొ అరుణాచలా || ౮౦ ||

ముక్కిడి మును జూపు ముకురము గాక నన్ హెచ్చించి కౌగలింపు అరుణాచలా || ౮౧ ||

సత్యాహమున మనో మృదు పుష్ప శయ్యపై మేన్గలయ గరుణింపు అరుణాచలా || ౮౨ ||

మీదు మీదుగ మ్రొక్కు భక్తుల జేరి నీ వందితే మేలిమి అరుణాచలా || ౮౩ ||

మై మై దణచి క్రుపాంజనమున నీ సత్య వశ మొనరించితి అరుణాచలా || ౮౪ ||


మొగ్గ పరిపి నను బట్ట బయట నీవు నట్టాడు టేలొకో అరుణాచలా || ౮౫ ||

మోహము ద్రప్పి నీ మోహ మొనర్చి నా మోహము తీరదా అరుణాచలా || ౮౬ ||

మౌనియై రాయిగా నలరక యున్నచో మౌన మిది యగునో అరుణాచలా || ౮౭ ||

ఎవరు నా నోటిలో మన్నును గొట్టి నా బ్రతుకును హరించినది అరుణాచలా || ౮౮ ||

ఎవరు గనక నాడు మదిని మైకపరచి కొల్లగొనిన దెవరు అరుణాచలా || ౮౯ ||

రమణుడనుచు నంటి రోషము గొనకనన్ రమియింప చేయరమ్ము అరుణాచలా || ౯౦ ||

రేయింబవలు లేని బట్ట బయట యింట రమియింపగా రమ్ము అరుణాచలా || ౯౧ ||

లక్ష్యముంచి యనుగ్రహాస్త్రము వైచి నన్ గబళించి తుసురుతో అరుణాచలా || ౯౨ ||

లాభమీ విహపర లాభ హీనుని చేరి లాభ మే మందితీవి అరుణాచలా || ౯౩ ||

రమ్మని యనలేదే వచ్చి నావంతివ్వ వెరకు నీ తలవిధి అరుణాచలా || ౯౪ ||

రమ్మని లోదూరి నీ జీవ మిడునాడే నా జీవమును బాసి తరుణాచలా || ౯౫ ||

విడిచిన కష్టమౌ విడాక నిన్నుసురును విడువ ననుగ్రహింపు అరుణాచలా || ౯౬ ||


ఇల్లు విడువ లాగి లోనింటిలో జొచ్చి యొగి నీదు నిలు చూపితరుణాచలా || ౯౭ ||

వెలిపుచ్చితి న్నీదు సేత కినియక నీ కృప వెలిబుచ్చి కావు అరుణాచలా || ౯౮ ||

వేదాంతమున వేరు లేక వెలింగెడు వేద పదము బ్రోవుం అరుణాచలా || ౯౯ ||

నింద నాశీస్సుగా గొని దయాపాత్రుగా చేసి విడక కావు అరుణాచలా || ౧౦౦ ||

నీట హిమముగా ప్రేమకారు నీలో నన్ ప్రేమగ కరగి బ్రోవు అరుణాచలా || ౧౦౧ ||

అరుణాద్రి యన నే కృపావల బడితి దప్పునె నీ కృపావల అరుణాచలా || ౧౦౨ ||

చింతింప కృపపడ సాలీడు వలె గట్టి చెరపెట్టి బక్షించితి అరుణాచలా || ౧౦౩ ||

ప్రేమతో నీ నామ మాలించు భక్త భక్తుల భక్తుగా బ్రోవు అరుణాచలా || ౧౦౪ ||

ననుబోలు దీనుల నిం పొంద కాచుచు చిరజీవివై బ్రోవు అరుణాచలా || ౧౦౫ ||

ఎముకలరుగు దాసు మృదు వాక్కు విను చెవిన్ గొనుమ నా యల్పోక్తు లరుణాచలా || ౧౦౬ ||

షమగల గిరి యల్ప వాక్కు సద్వాక్కుగ గొని కావు మరి యిష్ట మరుణాచలా || ౧౦౭ ||

మాలను దయచేసి యరుణాచలరమణ నా మాల దాల్చి బ్రోవు అరుణాచలా || ౧౦౮ ||


ఇతి శ్రీ అరుణాచల అక్షరమణమాల సంపూర్ణం ||

Arunachala Aksharamanamala

sākṣādaruṇagirīśvara varārhamagu nakṣaramaṇamāla namariñcuṭakunu
karuṇākaruṇḍagu gaṇapati yōsagi karama bhayakaramu kāpāḍugāka


aruṇācala śiva aruṇācala śiva
aruṇācala śiva aruṇācalā
aruṇācala śiva aruṇācala śiva
aruṇācala śiva aruṇācalā


aruṇācala manucu smariyiñcuvārala ahama nirmūlimpu aruṇācalā || 1 ||

aḷagu suṇdaramula valē cēri nēnu nī vuṇdamabhinnamai aruṇācalā || 2 ||

lōdūri lāgi nī lōguhaṇu ceragā namariñci tēmōkō aruṇācalā || 3 ||

evarikigā nannu ēlitī viḍiciṇa akhiḷamu nindiñcu aruṇācalā || 4 ||

ī ninda tappu ninnēṭiki dalapiñcitika viḍuvārevararu aruṇācalā || 5 ||

kaniṇa jaṇani kanna ghaṇadayādāyakā idiyā yanugrahamu aruṇācalā || 6 ||

ninnēmārci yaruganīka yullamu paini nurudigā nuṇḍumā aruṇācalā || 7 ||

ūrūru tirugaka yullamu niṇu gaṇi yaṇaga nī dyuti jūpumu aruṇācalā || 8 ||

naṇu ceraci ipuḍu naṇu kaliyaka viḍuṭidi magataṇa mokkōyā aruṇācalā || 9 ||

ēṭi kī nidura nanni taruḷu lāgaga idi nīku nyāyamā aruṇācalā || 10 ||

pañcēndriya khaḷuḷu madilōna dūrucō madini nīvuṇdavō aruṇācalā || 11 ||

okaḍavau ninu māya mōnariñci vaccuvārevaridi nī jālamu aruṇācalā || 12 ||


ōṅkāra vākyārttha yuttama samahīna ninnevareruguvāru aruṇācalā || 13 ||

avvabōle nōsagi nāku nī karuṇa nannēluṭa nī bhāramu aruṇācalā || 14 ||

kaṇnuku gaṇṇayi kaṇṇulēka kaṇu niṇu kaṇuvārevarugunumu aruṇācalā || 15 ||

inumu āyaskāntamu valē gavisi naṇu viḍuvaka kalasi nātōnuṇḍumu aruṇācalā || 16 ||

giri rūpa māinaṭṭi karuṇā samudramā kr̥pa jēsi nannēluṃ aruṇācalā || 17 ||

kriṇda mīdeṭanu cennōṇdu kiraṇamaṇi nā kriṇdu gati māpu aruṇācalā || 18 ||

kuṭra yaṇtayu gōsi guṇamuga bāliñcu guru rūpamai velugu aruṇācalā || 19 ||

kūci vālgannula kōtabaḍaka kr̥pa jēsi nan cēri kāvuṃ aruṇācalā || 20 ||

vañcakā vēḍiyun goñcemun garagavē abhaya mañcēlumā aruṇācalā || 21 ||

aḍugakicceḍu nīdu nakaḷaṅka magu kīrti hāni sēyaka brōvu aruṇācalā || 22 ||

hastalamalaka nīdu sadrasamuna sukhōnmāda moṇdaga nēlu aruṇācalā || 23 ||

vala nuñci bhaktula parimārcu ni nu gaṭṭukōni yeṭlu jīviṇtunu aruṇācalā || 24 ||


kōparahita guṇa gurigāga naṇu gōnu kōrayēmi cēsitī aruṇācalā || 25 ||

gautama pūjita karuṇā ghaṇa nagamā kaḍa gaṇṭa ēlumā aruṇācalā || 26 ||

sakaḷamu kabaḷiñcu karakāṇtiyina manō jalaja maralpumā aruṇācalā || 27 ||

tiṇḍini niñjēritini tiṇa nā nēnu śāntamai pōvuduṇu aruṇācalā || 28 ||

madi callapaḍa bhadrakara muñci yamṛtanōr teru manugrahacaṇdra aruṇācalā || 29 ||

vannenu ceraci nirvāṇa mōnarci kr̥pāvanne niḍi brōvumaruṇācalā || 30 ||

sukha samudramu poṅga vāk manammulaḍaṅga nūraka namaru maṇdaruṇācalā || 31 ||

vañciṇtuvēla nan śōdhiṃpakika nīdu jyōti rūpamu cūpumu aruṇācalā || 32 ||

paravidya garapi yī bhūmi māikamu vīḍi rūpagu vidya jūpu aruṇācalā || 33 ||

cērakunnanu mēnu nīruga garagi kaṇṇīṭērayi naśiṇtu aruṇācalā || 34 ||

chī yani drōsiṇa cēyu karma tapaṇa gākēdi manu māramu aruṇācalā || 35 ||

ceppaka ceppi nīvu mānuta nuṇḍani yūraka yuṇduvē aruṇācalā || 36 ||


sōmari naitiṇi minnani sukha nidra kanna vēredi gati aruṇācalā || 37 ||

śauryamu jūpiti śamiyiñce nani māya caliyiṃpa kunnāvu aruṇācalā || 38 ||

kukkaku nnīcamē nēnē gurutugōni vedaki niñjērudu aruṇācalā || 39 ||

jñānamu lēka nī yāsa dāinyamu bāpa jñānamu delpi brōvumaruṇācalā || 40 ||

tēṭi valenu nīvu vikasimpa lēdaṇi yeduṭa nilutuvēla aruṇācalā || 41 ||

tatva merugajāla naṇtayai nilutuvē yidiyēmi tatvamō aruṇācalā || 42 ||

tā nēnu tānnu tatva middānini tānugā cūpiṃtu aruṇācalā || 43 ||

trippi yahantanu neppuḍu lō druṣṭi gana deliyu nanunadē aruṇācalā || 44 ||

tīramuṇḍani yeda vedakiyu ninnu nē tirigi poṇditi brōvu maruṇācalā || 45 ||

satya jñānamu lēni yī janma phalamēmi yoppaga rāvēla aruṇācalā || 46 ||

śuddha vāṅmana yutuḷaṃ dōcu nī nijā haṇta galpi nanu brōvu aruṇācalā || 47 ||

daiva manucu ninnu daricēragā nannu pūrṇa nāśa mōnarciti aruṇācalā || 48 ||


vedukaka ganina saccrīyanugrahanidhi madi tegul tīrci brōvu aruṇācalā || 49 ||

dhairyamu parugiḍu nī nijahamaraya nē nāśamaiti brōvu aruṇācalā || 50 ||

tāki kr̥pākaramu nanu galiyakunna nijamu naśiṇtu brōvu aruṇācalā || 51 ||

dōṣarahita nīvu nātō naikyamayi nityānaṇda mayamōnarparuṇācalā || 52 ||

nagaku neḍamukādu ninvedakina nannu ganu kr̥pānaga vēsi aruṇācalā || 53 ||

nāna lēde veduka nēnayi nī vōṇṭi sthāṇuvai niliciti-vi aruṇācalā || 54 ||

nī jvāla gālcinan nīru sēseḍu munne nī kr̥pa varṣimpu aruṇācalā || 55 ||

nīvu nē naṇaga nityānaṇdamayamugā nilucu sthiti karuṇimpu aruṇācalā || 56 ||

aṇurūpu ninnu nē minnu rūpuṃ cēra bhāvōrmulepuḍāgu aruṇācalā || 57 ||

sūtra jñānamu lēni pāmaru nā māyā jñānamu kōsīkāvu aruṇācalā || 58 ||

makki makki karagi nē ninnu śaraṇanda nagnuḍavai nilciti aruṇācalā || 59 ||

nēstamuṇḍani nāku nī yāśa cūpinan mōsagiṃpaka brōvu aruṇācalā || 60 ||


navasi ceḍu phalamu naṇdēmi phala mēri pakvata lōgonu aruṇācalā || 61 ||

novvagiṃpakanu ninnu nōsagi nan gōnalēde yaṇtakuḍavu nāku aruṇācalā || 62 ||

cūci ciṇtiñci mēnuṃ dākiñci pakvamu cēsi nī vēli brōvuṃ aruṇācalā || 63 ||

māya viṣamu paṭṭi talakekki ceḍumunne karuṇa paṭōsagi brōvuṃ aruṇācalā || 64 ||

kanu kr̥pan māyāntamugā kr̥pa ganavēmi ganu nī kevaru ceppuṭevaru aruṇācalā || 65 ||

picci vīḍa ninubōle picci cēsite dayan piccini mānpu-mu aruṇācalā || 66 ||

nirbhīti ninu jēru nirbhītu nanu jēra bhīti nīkēlakō aruṇācalā || 67 ||

alpa jñāna madēdi sujñāna mēdayā aikya maṇda karuṇimpu aruṇācalā || 68 ||

bhūgaṇḍamagu madi pūrṇa gaṇḍamu gona būrṇa gaṇḍa mōsangu aruṇācalā || 69 ||

pēru talapaganē paṭṭi lāgiti-vi nī mahima kanudurevaru aruṇācalā || 70 ||

pōga bhūtamu pōni bhūtamai paṭṭinan bhūtagrastuni cēsi taruṇācalā || 71 ||

mr̥dulatan nē brāpu lēka vāḍaganīka paṭṭu kommayi kāvu aruṇācalā || 72 ||


poḍicē mayikaparci nā bōdha hariyiñci nī bōdha ganupiñciti aruṇācalā || 73 ||

pōkarākalu lēni samaraṅga divi jūpu mā kr̥pāpōrāṭam aruṇācalā || 74 ||

bhautika mau mēni paṭṭārci yepuḍu nī mahima gana garuṇiṇimpu aruṇācalā || 75 ||

malamandu nīviyya malamaguṭayō kr̥pā malamanduvai velugu aruṇācalā || 76 ||

mānamu gōni cēruvāri mānamu bāpi nirabhimānata velugu aruṇācalā || 77 ||

miñcagā vēḍeḍu kiñcijñuḍanu nanu vañciṃpakanu brōvumaruṇācalā || 78 ||

nāvikuḍuṇḍaga penugāli nalayu nāvanu gāka kāci brōvuṃ aruṇācalā || 79 ||

muḍimūlamul gāna munukōṇṭivi sariga miguya bhāramu lēdō aruṇācalā || 80 ||

mukkiḍi munu jūpu mukuramu gāka nan hecciñci kaugalimpu aruṇācalā || 81 ||

satyāhamuna manō mr̥du puṣpa śayyapai mēngalaya garuṇimpu aruṇācalā || 82 ||

mīdu mīduga mrokku bhaktula jēri nī vaṇditē mēlimi aruṇācalā || 83 ||

mai mai daṇaci kr̥pāñjanamuna nī satya vaśa mōnarciti aruṇācalā || 84 ||


mogga paripi nanu baṭṭa bayaṭa nīvu naṭṭāḍu ṭēlakō aruṇācalā || 85 ||

mōhamu drappi nī mōha mōnarci nā mōhamu tīradā aruṇācalā || 86 ||

mauniyai rāyigā nalaraka yuṇnacō mauna midi yagunō aruṇācalā || 87 ||

evaru nā nōṭilō mannu-nu goṭṭi nā bratuku-nu hariñcinadi aruṇācalā || 88 ||

evaru ganaka nāḍu madini maikaparaci kollagonina devaru aruṇācalā || 89 ||

ramaṇuḍanu-cu naṇṭi rōṣamu gōnaka-nan ramiyiṃpa cēyarammū aruṇācalā || 90 ||

rēyiṃbavalu lēni baṭṭa bayaṭa yiṇṭa ramiyiṃpagā rammū aruṇācalā || 91 ||

lakṣyamuñci yanugrahāstramu vaici nan gabaḷiñci tusurutō aruṇācalā || 92 ||

lābhamī vihapara lābha hīnuni cēri lābha mē maṇditīvi aruṇācalā || 93 ||

rammani yaṇalēdē vacci nāvaṇtivva veraku nī talavidhi aruṇācalā || 94 ||

rammani lōdūri nī jīva miḍunāḍē nā jīvamu-nu bāsi taruṇācalā || 95 ||

viḍicina kaṣṭamau viḍāka niṇnusuru-nu viḍuva nanugrahimpu aruṇācalā || 96 ||


illu viḍuva lāgi lōniṇṭilō jocci yogi nīdu nilu cūpitaruṇācalā || 97 ||

velipucciti nnīdu sēta kiniyaka nī kr̥pa velibucci kāvu aruṇācalā || 98 ||

vēdāṇtamuna vēru lēka veliṅgeḍu vēda padamu brōvuṃ aruṇācalā || 99 ||

niṇda nāśīssugā gōni dayāpātrugā cēsi viḍaka kāvu aruṇācalā || 100 ||

nīṭa himamugā prēmakāru nīlō nan prēmagā karagi brōvu aruṇācalā || 101 ||

aruṇādri yana nē kr̥pāvala baḍiti dappune nī kr̥pāvala aruṇācalā || 102 ||

ciṇtiṃpa kr̥papaḍa sālīḍu valē gaṭṭi cerapeṭṭi bakṣiñciti aruṇācalā || 103 ||

prēmatō nī nāma māliñcu bhakta bhaktula bhaktugā brōvu aruṇācalā || 104 ||

nanubōlu dīnuḷa niṃ pōṇda kācucu cirajīvivai brōvu aruṇācalā || 105 ||

emukalarugu dāsu mr̥du vākku viṇu cevin gōnuma nā yalpōktu laruṇācalā || 106 ||

ṣamagala giri yalpa vākku sadvākkuga gōni kāvu mari yiṣṭa maruṇācalā || 107 ||

mālanu dayacēsi yaruṇācalāramaṇa nā māla dālci brōvu aruṇācalā || 108 ||


iti śrī aruṇācala akṣaramaṇamāla saṃpūrṇam ||