Urake Poniyyara Nannuddamdana ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన
Author: Annamacharya రచయిత: Annamacharya
ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన
పల్లవి:
ఊరకే పోనియ్యరా నన్నుద్దండాన |
చేరలంతేసి కన్నుల జెంగలించే విప్పుడు ||
చరణం 1:
జూదమాడ బిలిచేవు చూపులనే జంకించేవు |
పేదవారి మేన సొమ్ము పెట్టనియ్యవా |
కేదమున నోడి గెలిచితి నంటా నా |
పాదమంటి తీసుకోరా బంగారు మట్టెలు //ఊరకే//
చరణం 2:
నెత్తమాడ బిలిచేవు నెఱవాది నంటాను |
అత్తమామ గలవార మదేమిరా |
ఒత్తి విన్నవించలేము ఓడితేను నీకు నాకు |
రిత్తమాట వద్దు రేఖ రేఖ పందెమా //ఊరకే//
చరణం 3:
సొక్కటాలు నిన్ననాడి సోలి సత్యభామకు |
మ్రొక్కితివి నేడు నాకు మ్రొక్కవలెగా |
చక్కని వేంకటపతిస్వామి నన్నుంగూడితివి |
మొక్కెద కర్పూర తాంబూలమీరా చాలును //ఊరకే//