Orasi Chudabote Nokati Nijamu Ledu ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు
Author: Annamacharya రచయిత: Annamacharya
ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు
పల్లవి:
ఒరసి చూడబోతే నొకటీ నిజము లేదు |
పొరల మేను ధరించి పొరలగ బట్టెను ||
చరణం 1:
పాతకములటకొన్ని బలు పుణ్యాలట కొన్ని |
యీతల స్వర్గనరకాలిచ్చేనట |
యేతుల నందుగొన్నాళ్ళు యిందు గొన్నాళ్ళు దేహికి |
పోతరించి కాతరించి పొరలనే పట్టెను //ఒరసి//
చరణం 2:
పొలతులట కొందరు పురుషులట కొందరు |
వెలుగును జీకట్లు విహారమట |
కలవరింతలు గొంత ఘన సంసారము గొంత |
పొలసి జీవులు రెంటా బొరలగ బట్టెను //ఒరసి//
చరణం 3:
ఒక్కవంక జ్ఞానమట వొక్కవంక గర్మమట |
మొక్కి యిహపరాలకు మూలమిదట |
తక్కక శ్రీ వేంకటేశు దాసులై గెలిచిరట |
పుక్కిట నిన్నాళ్ళు రెంటా బొరలగ బట్టెను //ఒరసి//