Oorakae Neesaranani ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
Author: Annamacharya రచయిత: Annamacharya
ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక
పల్లవి:
ఊరకే నీశరణని వుండుటే నాపనిగాక |
యీరీతి నావుపాయము లేడ కెక్కీనయ్యా ||
చరణం 1:
ముందే అంతర్యామివై మొగి నాలో నుండగాను |
చెంది నిన్ను లేనివానిజేసుక నామనసులో |
గొంది నీయాకారముగా కొంత నే భావించుకొంటా |
ఇందు గల్పిత ధ్యానము లెట్టు చేసేనయ్యా //ఊరకే//
చరణం 2:
కన్నులు జూచినందెల్ల కమ్మి నీవై యుందగాను |
అన్నిటా బ్రత్యక్షమందు అభావన చేసుకొని |
విన్ననై తెలియలేక వేరే యెందొ వెదకుచు |
పన్నినప్రయాసాల బడనేటికయ్యా //ఊరకే//
చరణం 3:
శ్రీ వేంకటాద్రిమీద శ్రీపతివై కొలువుండి |
ఆవటించి తలపులో నచ్చొత్తి నట్టుండగాను |
దేవు డెట్టివాడంటా తెగనిచదువులందు |
సోవలుగా నింకనేమి సోదించేనయ్యా //ఊరకే//