Okkade Ekamga Virudurviki Daivamauna ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
Author: Annamacharya రచయిత: Annamacharya
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
పల్లవి:
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా |
యెక్కడా హనుమంతుని కెదురా లోకము ||
చరణం 1:
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు |
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు |
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు |
యెందునా హనుమంతుని కెదురా లోకము //ఒక్కడే//
చరణం 2:
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు |
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు |
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు |
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము //ఒక్కడే//
చరణం 3:
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు |
మలసి మేరుపుపొంత సింహమైనాడు |
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి |
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము //ఒక్కడే//